: ఇలాంటి రెడ్లను ఎంతో మందిని ఎదుర్కున్నా: నిప్పులు చెరిగిన అనిత


ఒక చదువుకున్న దళిత మహిళగా ఇలాంటి రెడ్లను ఎంతమందినో ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్, రోజా తదితరులు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలియజేస్తున్న వేళ, మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. రోజా ఏ అధికారంతో అసెంబ్లీలోకి అడుగుపెడతారని ప్రశ్నించిన ఆమె, అసెంబ్లీకి సంబంధించినంత వరకూ స్పీకర్ దే తుది నిర్ణయమని, దాన్ని ప్రశ్నించే హక్కు కోర్టులకు లేదని అన్నారు. కోర్టులు కేవలం సూచనలు మాత్రమే చేస్తాయని, సభలో రోజా ప్రవర్తనను తాము సమర్థించడం లేదని హైకోర్టు ఉత్తర్వుల్లోనే ఉందని అన్నారు. రోజా ప్రవేశాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేసిన ఆమె, ఏవైనా కష్టాలు వచ్చినప్పుడే గుండె ధైర్యం పెరుగుతుందని, తనకు అండగా టీడీపీ పార్టీ మొత్తం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News