: ఈ ఆదివారం మీ దేశానికి వస్తున్నా... క్యూబా యువతికి బరాక్ ఒబామా ఈ-మెయిల్!


అమెరికా, క్యూబా... ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు లేని దేశాలు. ఎన్నో ఏళ్ల తరువాత అమెరికా నుంచి క్యూబాకు ఓ ఈ-మెయిల్ వచ్చింది. అది కూడా యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి. 1960వ దశకంలో న్యూయార్క్ నుంచి క్యూబాకు లెటర్ బాంబు వచ్చిన తరువాత, ఇరు దేశాల మధ్యా పోస్టల్ సేవలు రద్దయ్యాయి. ఆపై గత నెల 18న తమ దేశానికి రావాలని, తన ఇంటికి వచ్చి క్యూబా కాఫీని రుచి చూడాలని ఇలియానా యార్జా అనే యువతి ఒబామాకు మెయిల్ పంపగా, దానికి ఆయన్నుంచి సమాధానం వచ్చింది. ఈ ఆదివారం తాను క్యూబాకు వస్తున్నానని, తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలని ఆమెకు తెలిపారు. దీంతో 1928 తరువాత ఓ అమెరికా అధ్యక్షుడి క్యూబా పర్యటన ఖరారైనట్లయింది.

  • Loading...

More Telugu News