: అసెంబ్లీకి చేరుకున్న రోజా... లాయర్లతో కలిసి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే


ఏపీ అసెంబ్లీలో ఉత్కంఠకు తెర లేచింది. ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. న్యాయవాదులు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన ఆమె సభలోకి వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే, రోజాను అడ్డుకోవాలన్న స్పీకర్ కార్యాలయం ఆదేశాలతో పెద్ద సంఖ్యలో మార్షల్స్ కూడా అప్పటికే అసెంబ్లీ ఆవరణలో భారీ సంఖ్యలో మోహరించారు. అసెంబ్లీలోకి అనుమతించమని ఓ పక్క ప్రభుత్వం చెప్పినా పట్టించుకోకుండా రోజా అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News