: యుద్ధభూమిలో చైనా సరికొత్త నిఘా విమానం
ప్రపంచ సైనిక అవసరాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ దేశం ఎవరిపై దాడికి దిగుతుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆధిపత్యం నిరూపించుకునే దిశగా కొన్ని దేశాలు ప్రయత్నిస్తుండగా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మరికొన్ని దేశాలు సాయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధభూమిలో చైనా సరికొత్త నిఘా విమానాన్ని దించింది. ఆస్ట్రేలియాకు చెందిన 'డైమండ్ డీఏ42' విమానాన్ని పోలి ఉండేలా దీనిని చైనా ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ నిర్మించింది. దీనిని 'ది సీఎస్ఏ-003 స్కౌట్' గా వ్యవహరిస్తున్నారు. దీని రెక్కల కింద ఏర్పాటు చేసిన సెన్సర్లు యుద్ధభూమిలో శత్రువుల కదలికలను, వారి ఆయుధాలను గుర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు.