: అభివృద్ధి అంటే రోడ్లు, కాల్వలే కాదు: బుర్రిపాలెంలో మహేశ్ భార్య నమ్రత


అభివృద్ధి అంటే నున్నటి రోడ్లు, కాల్వలు మాత్రమే కాదని ప్రముఖ నటుడు మహేశ్ బాబు భార్య నమత్రా శిరోద్కర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో మహేశ్ సోదరి ఘట్టమనేని పద్మావతి (ఎంపీ గల్లా జయదేవ్ భార్య)తో కలిసి పర్యటించిన సందర్భంగా నమ్రత మాట్లాడుతూ, బుర్రిపాలెం అంటే మహేశ్ బాబుకు ఎంతో ఇష్టమని చెప్పారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడం, కాల్వలు తవ్వించడం మాత్రమే కాదని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని ఆమె సూచించారు. మరుగుదొడ్డి లేని ఇళ్లకు వాటిని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. అలాగే గ్రామంలో ఉండాల్సిన వసతుల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నామని ఆమె తెలిపారు. ముందు గ్రామంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. దశల వారీగా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News