: ఐదేళ్లుగా ధోనీ ఆ కారు ట్యాక్స్ చెల్లించలేదు: రాంచీ డీటీవో


రాంచీ ట్రాన్స్ పోర్టు ఆఫీసులో టైపిస్టు చేసిన తప్పు, ధోనీకి తలనొప్పి తెచ్చిపెట్టింది. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న 'హమ్మర్' కారుకు సంబంధించిన ట్యాక్సులను ఇంతవరకు చెల్లించలేదని రాంచీ డీటీవో తెలిపారు. దీని వల్ల పెనాల్టీతో కలిపి ఒకేసారి పన్ను మొత్తం చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ధోనీ కొనుగోలు చేసిన 'హమ్మర్' కారు వివరాలు ఇంతవరకు రికార్డుల్లో నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లలో ఒకటిగా పేరొందిన 'హమ్మర్' కారును తమ శాఖకు చెందిన టైపిస్టు పొరపాటున 'స్కార్పియో'గా పేర్కొన్నారని ఆయన తెలిపారు. 'హమ్మర్' అనేది అంతర్జాతీయ బ్రాండ్ అని తెలియకపోవడంతో ఆయన పొరపాటుపడ్డారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News