: నేను పందిమాంసం కూడా తింటాను: రచయిత్రి తస్లీమా నస్రీన్


‘నేను పందిమాంసం తింటాను’ అంటూ వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తన ట్విట్టర్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అసలు ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందంటే.. రాజస్థాన్ లో బీఫ్ తిన్న నలుగురు విద్యార్థులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తస్లీమా నిరసన తెలుపుతూ ఒక ట్వీట్ చేసింది. ఈ సంఘటన గురించి విని చాలా భయపడ్డానని, బీఫ్ తింటున్న తనను కూడా ఏదో ఒక రోజున చంపేస్తారేమోనన్న భావన కల్గిందని ఆ ట్వీట్ లో పేర్కొంది. ఈ ట్వీట్ కు ప్రతిస్పందించిన ఒక వ్యక్తి ‘నాన్-వెజిటేరియన్ పై చాలా ఆసక్తి చూపుతున్న మీరు, పందిమాంసం కూడా ఒకసారి తినిచూడచ్చుగా?’ అంటూ అడిగాడు. దానికి తస్లీమా స్పందిస్తూ, ‘ఐ ఈట్ పోర్క్’ అని పేర్కొంది.

  • Loading...

More Telugu News