: నేను ప్రేమలో పడ్డాను: మల్లికా శెరావత్


పలు చిత్రాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన శృంగారతార మల్లికా శెరావత్ ప్రేమలో పడింది. గతంలో బాలీవుడ్ లో పలువురితో ప్రేమాయణం సాగించిన మల్లికా శెరావత్ తాజాగా మరోసారి ప్రేమలో పడింది. అయితే ఈసారి కొత్తగా చెప్పడం వెనుక కారణం మాత్రం ప్రేమికుడు విదేశీయుడు కావడమేనని బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. మల్లికా తన ట్విట్టర్ ఖాతాలో రాస్తూ 'ప్రేమలో ఉండడం అన్నది ప్రపంచంలోనే గొప్ప అనుభూతి' అని పేర్కొంది. ఆమె ప్రియుడి పేరు సిరిల్లే అక్సెన్ ఫ్యాన్స్...ఇతను ఫ్రెంచ్ కు చెందిన వ్యాపారవేత్త. అతనితో ఘాటు ప్రేమలో ఉన్నానని, డేటింగ్ చేస్తున్నానని ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా వీరిద్దరూ బిజినెస్ ఫ్లైట్ ఎంట్రన్స్ వద్ద సన్నిహితంగా దిగిన ఓ ఫోటోను కూడా పోస్టు చేసింది. వాలెంటైన్స్ డే రోజున సిరిల్ బోలెడు బహుమతులతో పాటు, ఓ కారు కూడా కొనిచ్చాడట. ఆ కారులో మల్లిక షికార్లు చేస్తోందని వినికిడి.

  • Loading...

More Telugu News