: ఇష్టం లేకపోతే దేశం విడిచివెళ్లిపోవచ్చు: ఒవైసీపై మండిపడ్డ అహోబిలం పీఠాధిపతి
ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజాసమస్యలపై దృష్టి సారించడం మానేసి, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విద్వేషాలు రేపడం సరికాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి అహోబిలం పీఠాధిపతి హితవు పలికారు. కడప జిల్లా కమలాపుంలోని శ్రీకృష్ణాలయంలో పూజలు నిర్వహించిన సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, పవిత్ర భారతదేశంలో పుట్టి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ముస్లిం సోదరులు భారతదేశం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని, పలు చోట్ల తమ ప్రసంగాలు వినేందుకు కూడా వస్తున్నారని ఆయన చెప్పారు. ప్రశాంతంగా ఉన్న దేశ ప్రజల్లో విద్వేషాలు రేపవద్దని ఆయన అసదుద్దీన్ కు హితవు పలికారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ఎంపీ 'భారత్ మాతాకీ జై' అనను అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు.