: కాంగ్రెస్ వార్ రూంలోకి అడుగుపెట్టనున్న బాలీవుడ్ బ్యూటీ!
కాంగ్రెస్ వార్ రూంగా పేరొందిన భవనాన్ని ప్రముఖ నటి, రాజ్యసభ సభ్యురాలు రేఖకు అధికారిక నివాసంగా కేటాయించారు. ఢిల్లీలోని రకబ్ గంజ్ లోని ఓ ఇంటిని కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాల నిర్వహణకు వినియోగిస్తుంటుంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఆ భవనానికి నిరంతరం వచ్చిపోతుంటారు. దీంతో ఆ భవనాన్ని కాంగ్రెస్ వార్ రూంగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడీ భవనాన్ని పార్లమెంటు సభ్యురాలు రేఖకు అధికారిక నివాసంగా అధికారులు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భవనాన్ని రేఖకు నివాసంగా కేటాయించిన విషయం తమ పార్టీకి తెలియదని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.