: సివిల్ డ్రెస్సుల్లో మాత్రమే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి హాజరవ్వాలి!: ఏపీ ఎస్.ఎస్.సి బోర్డు కమిషనర్ సంధ్యారాణి


పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సీ బోర్డు కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, హాల్ టికెట్లు ఇప్పటికే పంపిణీ చేసేశామని చెప్పారు. వెబ్ సైట్లో హాల్ టికెట్లు పెట్టామని, ఇంకా ఎవరైనా హాల్ టికెట్లు అందని వారుంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆమె చెప్పారు. పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 గంటలకల్లా చేరుకోవాలని ఆమె సూచించారు. 8:45 నిమిషాలకు పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్థులను అనుమతిస్తారని 9 గంటలకల్లా వారివారి స్థానాల్లో కూర్చోవాలని ఆమె తెలిపారు. సరిగ్గా 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని ఆమె చెప్పారు. పరీక్షా కాలంలో స్కూల్ యూనిఫాం ధరించకూడదని ఆమె స్పష్టం చేశారు. సివిల్ డ్రెస్సుల్లోనే పరీక్షలకు హాజరుకావాలని, మాస్ కాపీయింగ్ ను తీవ్రంగా పరిగణిస్తామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News