: అసెంబ్లీకి చేరుకున్న రోజా... అసెంబ్లీ సెక్రటరీకి కోర్టు ఉత్తర్వుల కాపీ అందజేత
ఎమ్మెల్యే రోజా ఏపీ అసెంబ్లీకి కొద్ది నిమిషాల క్రితం చేరుకున్నారు. ఏడాది సస్పెన్షన్ తీర్మానాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని అందుకున్న ఆమె అసెంబ్లీకి చేరారు. రోజాకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ కార్యదర్శిని కలిసి హైకోర్టు ఉత్తర్వుల కాపీని ఆమె అందజేశారు. కాగా, అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ గేటు వద్ద మహిళా మార్షల్స్ ను ఉంచారు. అసెంబ్లీకి బయలుదేరడానికి ముందు రోజా ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, ‘హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీని తీసుకుని ఇప్పడే నేను అసెంబ్లీకి బయలుదేరుతున్నాను. నేను అసెంబ్లీకి వెళ్లవచ్చు అని జడ్జిగారు స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఒకవేళ అధికారపక్ష సభ్యులు నన్ను అడ్డుకోవాలని చూస్తే అది కంటెంట్ ఆఫ్ కోర్టు అవుతుంది’ అని రోజా పేర్కొన్నారు.