: ఇది ప్రభుత్వమా? లేక ప్రైవేటు రంగ సంస్థా?: వైఎస్ జగన్
బడ్జెట్ లెక్కలు తారుమారు చేశారని, అందుకే 2014-15 లెక్కలు చూపించలేదని అధికారపక్షంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పబ్లిక్ డిపాజిట్స్ ను ఎడాపెడా వాడేసుకుంటున్నారని, ఇది చట్ట రీత్యా నేరమని, ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ ను దాటి వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ ప్రకారం కేవలం 3 శాతం వరకే అప్పులు తీసుకోవచ్చని, కానీ, చంద్రబాబు ప్రభుత్వం 8 శాతం వరకు అప్పులు చేసిందని, ఇది ప్రభుత్వమా? లేక ప్రైవేట్ రంగ సంస్థనా? అంటూ జగన్ మండిపడ్డారు.