: ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు... హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు


దేశంలో ఉగ్రవాదులకు సంబంధించిన అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఈ అలజడులు మరింత మేర పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తాజాగా బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. ఎయిర్ పోర్టులోని రెండు విమానాల్లో బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్ పోర్టు సిబ్బందికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన భద్రతా అధికారులు ఎయిర్ పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాల్లోని ప్రయాణికులను కిందకు దించేసి బాంబు స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News