: అసదుద్దీన్ ఓ పాకిస్థానీ!... అందుకే భరత మాతకు జైకొట్టట్లేదు: స్వామి పరిపూర్ణానంద ధ్వజం


పీకపై కత్తి పెట్టినా ‘భారత్ మాతా కీ జై’ అనే మాట తన నోట పలకదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై పలు వర్గాల నుంచి ఎదురు దాడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ నేతలు సహా పలు జాతీయ పార్టీల నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. ఓవైసీపై కేసులు కూడా నమోదయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆధ్మాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద కూడా ఓవైసీపై ధ్వజమెత్తారు. కొద్దిసేపటి క్రితం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా పరిపూర్ణానంద... ఓవైసీ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసదుద్దీన్ ఓవైసీ ఓ పాకిస్థానీ. అందుకే ‘భారత్ మాతా కీ జై’ అనే మాటను ఉచ్చరించనని ప్రకటించారు. ఓవైసీ వ్యాఖ్యలపై హిందూ వాదులు సహనంతో ఉండాలి’’ అని పరిపూర్ణానంద కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో సంపూర్ణ మద్యపాననిషేధాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News