: అటు విపక్షం, ఇటు అధికార పక్షం, మధ్యలో మార్షల్స్!... అసెంబ్లీలో హైటెన్షన్!


అసెంబ్లీ ప్రాంగణంలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన రోజాకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నేటి ఉదయం సంచలన తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వుల కాపీలు తీసుకుని నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నట్లు రోజా కోర్టు వద్దే ప్రకటించారు. ఈ క్రమంలో అసెంబ్లీలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రోజాకు స్వాగతం పలికేందుకు ఓ వైపు వైసీపీ సభ్యుల సన్నాహాలు, మరోవైపు రోజాను అడ్డుకునేందుకు అధికార పక్షం యత్నాలు, అప్పటికే స్పీకర్ కార్యాలయం ఆదేశాలతో భారీ సంఖ్యలో మార్షల్స్ రంగ ప్రవేశం...తదితర పరిణామాలతో అసెంబ్లీ ఆవరణలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. రోజాను అడ్డుకుని తీరతామని అధికార పక్షం ప్రకటన, అడ్డుకుంటే సహించేది లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరికలు అక్కడ ఏ క్షణాన ఎలాంటి పరిణామం చోటుచేసుకుంటుందా? అన్న భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఎలాంటి పరిణామాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా సిద్ధంగా వున్నారు.

  • Loading...

More Telugu News