: ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం:చంద్రబాబుతో మలేషియా మంత్రి
ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మలేషియా ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ పరిపాలన, సంస్కరణలపై కలిసి పనిచేస్తామని మలేషియా రవాణా శాఖ మంత్రి లీవో షంగ్ లై పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో షంగ్ లై భేటీ అయ్యారు. సీ పోర్టులు, ఎయిర్ పోర్టులలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. మలేషియా పర్యాటకం అభివృద్ధి గురించి ఆయన చర్చించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం, ఏపీల వనరులు, అవకాశాల గురించి మలేషియా మంత్రికి చంద్రబాబు వివరించారు. మలేషియా విధానాలు, వారి ప్రభుత్వ విధానం ‘పెమాండు’ తనకు స్ఫూర్తి నిస్తాయని బాబు అన్నారు. కాగా, మలేషియా పర్యటనకు రావాల్సిందిగా చంద్రబాబును లీవో ఆహ్వానించారు.