: అసెంబ్లీలో ఎదురుపడ్డ మంత్రి పరిటాల సునీత, ఎర్రబెల్లి


సమైక్యాంధ్రప్రదేశ్ లో కలిసి పనిచేసిన ఇద్దరు టీడీపీ నేతలు నేడు ఎదురుపడ్డారు. ఆ నేతల్లో ఒకరు తెలంగాణకు, మరొకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. అందులో ఒకరు ఏపీ మంత్రి పరిటాల సునీత కాగా, మరొక నేత తాజాగా టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎర్రబెల్లి దయాకర్ రావు. వారిద్దరూ అసెంబ్లీ లో ఎదురుపడ్డారు. కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ‘పార్టీ మారకుండా ఉంటే బాగుండేదని’ ఎర్రబెల్లితో మంత్రి సునీత అన్నారు. దీనికి ఎర్రబెల్లి ప్రతిస్పందిస్తూ.. ఏపీలో చంద్రబాబు, ఇక్కడ తాము సుస్థిరంగా ఉండాలని ఆయన అన్నట్లు సమాచారం. కాగా, టీడీపీ ఎమ్మెల్యేలు 12 మంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాసయాదవ్, తీగల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News