: కింకర్తవ్యం!... రోజా సస్పెన్షన్ పై చంద్రబాబు, స్పీకర్ తో యనమల వరుస భేటీలు


ఏపీలో టీడీపీ సర్కారుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చింది. తమపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్న వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలివ్వడంతో చంద్రబాబు సర్కారుకు దాదాపుగా షాక్ తగిలినట్టైంది. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన చిన్న పొరపాటు కారణంగానే కోర్టులో ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలిందన్న భావన వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పు వెలువడగానే రంగంలోకి దిగిన యనమల... సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ లతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తదుపరి వ్యవహరించాల్సిన వైఖరి గురించి, నాలుగు వారాల తర్వాత కోర్టులో జరగనున్న విచారణ గురించి వారు చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోజా సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణమే యనమల... చంద్రబాబు, కోడెలతో భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News