: రోజ్ గార్డెన్ లో రెడ్ కోట్ డ్రమ్మర్ తో ఒబామా సరదా!...సోషల్ మీడియాలో వీడియో వైరల్


అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి నుంచి బరాక్ ఒబామా త్వరలోనే దిగిపోనున్నారు. పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన వీడ్కోలు ప్రసంగం కూడా చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఇప్పటిదాకా పనిచేసిన అందరిలోకి ఒబామానే ప్రత్యేకం. ఏ ఒక్క అధ్యక్షుడు కూడా ఒబామా మాదిరిగా జనంతో మమేకం కాలేదు. తాజాగా నిన్న అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో ఒబామా సందడి చేశారు. రెడ్ కోట్ డ్రమ్మర్ లిన్ మాన్యువల్ మిరిండాకు సహకరిస్తూ ఒబామా సరదా సరదాగా గడిపారు. వైట్ హౌస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలోకి చేరిపోయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

  • Loading...

More Telugu News