: పోలీసు అధికారిపై యూపీ మహిళా ఎమ్మెల్యే తిట్ల దండకం!


దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగినా సంచలనమే. ఇప్పటికే ఆ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలు వివాదాల్లో చిక్కుకున్నారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి ఆజం ఖాన్ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తున్నారు. తాజాగా అధికార పార్టీ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన మహిళా ఎమ్మెల్యే లక్ష్మీ గౌతం వివాదంలో చిక్కుకున్నారు. జనం చూస్తుండగానే ఆమె ఓ పోలీసు ఇన్ స్పెక్టర్ పై తిట్ల దండకం అందుకున్నారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడమే కాక ఆమెను పట్టించుకోకపోవడమే ఇన్ స్పెక్టర్ చేసిన పొరపాటు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మీ గౌతం... నిండుగా జనం ఉన్న ప్రదేశంలో ఆ ఇన్ స్పెక్టర్ పై తిట్ల దండకం అందుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాతోనూ ఆమె కాస్తంత ఘాటుగానే స్పందించారు. ఫిర్యాదులపై వేగంగా చర్యలు చేపట్టాల్సిన అధికారి, అందుకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగానే ఆయనను తిట్టానని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News