: రోజాకు హైకోర్టులో ఊరట... సస్పెన్షన్ ఎత్తివేత... అసెంబ్లీకి హాజరు కావచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ!
ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టి వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల తర్వాత మళ్లీ వాదనలు వింటామని న్యాయస్థానం పేర్కొంది. అసెంబ్లీకి రోజా హాజరుకావచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రోజా, ఆమె తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రస్తుతం కోర్టులోనే ఉన్నట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో రోజా విలేకరులతో మాట్లాడనున్నారు.