: వైకాపా వాయిదా తీర్మానాలకు పోటీగా 'కాల్ అటెన్షన్' నోటీసులిచ్చిన తెలుగుదేశం
నేటి అసెంబ్లీలో వైకాపా, తెలుగుదేశం పార్టీలు పోటాపోటీగా నోటీసులను ఇచ్చాయి. విపక్ష వైకాపా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందని పేర్కొంటూ, దీనిపై తక్షణం చర్చించాలని డిమాండ్ చేస్తూ, వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దీనికి ప్రతిగా, అత్యధిక ప్రజా ప్రాముఖ్యత ఉన్న అంశాలపై చర్చను చేపట్టేలా ఉన్న నిబంధన 'కాల్ అటెన్షన్'ను వాడుకుంటూ తెలుగుదేశం నోటీసులు ఇచ్చింది. సహకార బ్యాంకుల్లో రుణాల మంజూరులో గతంలో జరిగిన అవకతవకలపై చర్చను చేపట్టాలని కోరింది. ఈ నోటీసులపై స్పీకర్ కోడెల స్పందించాల్సి వుంది.