: యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా శ్రీనివాసన్ ను కాదన్న ఒబామా!


ఖాళీగా ఉన్న యూఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి ఓ భారతీయుడికి దక్కనుందన్న ఆశలు ఆవిరయ్యాయి. శ్రీ శ్రీనివాసన్ ను ఈ పదవికి ఎంపిక చేస్తారని లక్షలాది మంది అమెరికన్ ఇండియన్లు భావించగా, అధ్యక్షుడు బరాక్ ఒబామా మెర్రిక్ గార్లాండ్ ను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా మరణంతో న్యాయమూర్తి పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రస్తుతం డీసీ అపీల్స్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న 63 ఏళ్ల గార్లాండ్ ను ఒబామా ఎంపిక చేశారు. ఆయనకు జూనియర్ గా ఉన్న 49 ఏళ్ల శ్రీనివాసన్ కు అవకాశం దక్కవచ్చని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి బ్యాక్ గ్రౌండ్ గురించి దాదాపు 20 నిమిషాల పాటు ఒబామాకు అధికారులు వివరించగా, న్యాయమూర్తిగా అపార అనుభవమున్న గార్లాండ్ వైపే ఒబామా మొగ్గు చూపారు. కాగా, 1997లో డీసీ అపీల్స్ కోర్టులో జూనియర్ న్యాయమూర్తిగా శ్రీనివాసన్ ను అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News