: 'భారత్ మాతాకీ జై' అని నినదిస్తూ, అసదుద్దీన్ ను తరిమేయాలన్న తస్లిమా నస్రీన్


బాలీవుడ్ లో ప్రముఖ గేయ రచయితగా పేరున్న జావేద్ అఖ్తర్, ఏఐఎంఐఎం నేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఒక రోజు అనంతరం, బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ గొంతు కలిపారు. "రాజ్యసభలో జావేద్ అఖ్తర్ చేసిన ఫేర్ వెల్ ప్రసంగం కదిలించింది. ఓవైసీ వంటి వారిని తరిమేయాలి. భారత్ మాతా కీ జై" అని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం జావేద్ పార్లమెంటులో ప్రసంగిస్తూ, అసదుద్దీన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. "ఓ షేర్వాణీని ధరించాలని, టోపీ పెట్టుకోవాలని రాజ్యాంగం ఆయన్నేమీ కోరలేదు కదా" అని కూడా జావేద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News