: అపోలో ఆసుపత్రిలో నారా బ్రాహ్మణి... బాలయ్యతో కలిసి పరామర్శించిన చంద్రబాబు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం మదీనగూడలోని తమ సొంత ఫామ్ హౌస్ లో చంద్రబాబు కుటుంబం ఉంటున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం సదరు ఇంటిలో ఉన్నట్టుండి బ్రాహ్మణి స్పృహ తప్పి పడిపోయారు. నీరసించిన కారణంగా పడిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటీన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరగడానికి ముందే చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాలు రాత్రికి గాని ముగియలేదు. సమావేశాలు ముగిసిన వెంటనే విషయం తెలుసుకున్న చంద్రబాబు... బ్రాహ్మణి తండ్రి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి నేరుగా అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో బ్రాహ్మణిని పరామర్శించిన తరువాత గాని ఆయన ఇంటికి వెళ్లలేదు. ఇక నిన్న ఉదయం కూడా అసెంబ్లీకి వెళ్లేముందుగానే అపోలో ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కోడలిని మరోమారు పరామర్శించారు. దాదాపు గంటపాటు ఆయన అక్కడే గడిపారు. కోడలు ఆరోగ్యం గురించి ఆయన వైద్యులతో మాట్లాడారు. పెద్దగా భయపడాల్సిందేమీ లేదని, గురువారం (నేడు) బ్రాహ్మణిని డిశ్చార్జీ చేస్తామని వైద్యులు చెప్పడంతో చంద్రబాబు అసెంబ్లీకి బయలుదేరారు.

  • Loading...

More Telugu News