: రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోన్న కాంగ్రెస్: వెంకయ్య నాయుడు


బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మరోమారు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తాత్కాలిక ప్రయోజనాలకోసం రాజ్యాగ సంస్థలను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. 2జీ స్పెక్ట్రమ్ స్కాంలో జేపీసీ ఎదుట ప్రధాని, ఆర్థిక మంత్రి హాజరు కావాలని ఆయన డిమాండు చేశారు. లేకుంటే ప్రధానమంత్రి పదవిలో ఉండేందుకు మన్మోహన్ కు అర్హత లేదని విమర్శించారు. కమిటీ నుంచి విపక్ష సభ్యులను తొలగించాలనటం ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తుందన్నారు. భారత్ సరిహద్దులోకి చైనా చొచ్చుకు వస్తుంటే ఈ అంశం చాలా చిన్నదని విదేశాంగ మంత్రి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు

  • Loading...

More Telugu News