: మెదక్ జిల్లాలో ‘ఖాకీ’లకు షాక్!... హెల్మెట్ ధరించలేదని 31 మంది కానిస్టేబుళ్లకు జరిమానా!


ప్రస్తుతం హైదరాబాదు పరిధిలో హెల్మెట్ లేనిదే బైకెక్కితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించక తప్పని పరిస్థితిపై వాహన చోదకులు పలు ఇబ్బందులు పడుతున్నారు. హెల్మెట్లు కొనుగోలు చేసేందుకు పరుగులు పెడుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఒక్క హైదరాబాదుకు మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని జిల్లాల్లోనూ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో నిన్న పోలీస్ కానిస్టేబుళ్లకు షాకిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించలేదన్న కారణంగా ఏకంగా 31 మంది కానిస్టేబుళ్లకు పోలీసు బాసులు జరిమానా రాసేశారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో 24 మంది, తూప్రాన్ లో 7 మంది కానిస్టేబుళ్లు ఇలా జరిమానాకు గురయ్యారు.

  • Loading...

More Telugu News