: పవన్ కల్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్
ప్రముఖ దర్శకుడు, వివాదాస్పద ట్వీట్లతో తరచూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన ప్రముఖ కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై, దేవుడిపై తన ఇష్టాన్ని చాటుకున్నారు. అదే సమయంలో వారిని ఆరాధించే వారి విషయంలో భిన్నంగా స్పందించాడు. ‘రకరకాల కారణాలతో పవన్ కల్యాణ్ ని, దేవుడ్ని ప్రేమిస్తాను. అవే కారణాలతోనే దేవుడి భక్తులను, పవన్ కల్యాణ్ అభిమానులను ద్వేషిస్తాను’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వదిలారు. దీనిపై ఎవరెలా స్పందిస్తారో చూడాలి.