: కృష్ణా పుష్కరాలపై ఏర్పాటైన ఏపీ మంత్రివర్గ కమిటీ


ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న కృష్ణమ్మ పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్ సర్కారు ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సభ్యులుగా ఉండనున్నారు. కృష్ణా నదీ పుష్కరాలు ఈ ఏడాది ఆగస్ట్ 12న ప్రారంభమై అదే నెల 23 వరకు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖలను మంత్రుల కమిటీ సమన్వయం చేసి ఏర్పాట్లు, కార్యక్రమాల పర్యవేక్షణకు చర్యలు తీసుకుంటుంది. పుష్కర స్నానాల కోసం కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 280 ఘాట్లు ఏర్పాటు చేస్తోంది. ఘాట్ల వద్దకు చేరుకునేందుకు వీలుగా ఒక్క కష్ణా జిల్లాలోనే వివిధ ప్రాంతాల నుంచి 2400 బస్సు సర్వీసులను ఆర్టీసీ నడపనుంది. ఇక ప్రతి జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు 200 బస్సు సర్వీసులను నడపనున్నారు. అలాగే రైళ్ల ద్వారా 55 లక్షల మంది ప్రయాణిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News