: ఇస్లామిక్ టెర్రరిజం కన్నా హిందూ ఛాందసవాదమే ప్రమాదకారి!: చరిత్రకారుడు రామచంద్ర గుహ


భారత్‌లో పెరిగిపోతున్న హిందూ జాతీయ‌వాదం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఐదురోజుల సాహితీ ఉత్సవ ప్రారంభం వేడుక‌లో ఆయ‌న‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ... హిందూ జాతీయవాదం చెల‌రేగ‌డం దేశానికి కొత్తేం కాద‌ని అన్నారు. రామ జ‌న్మ‌భూమి ఆందోళ‌న‌లో హిందూ జాతీయ‌వాదం క‌న‌ప‌డ‌డాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఆందోళ‌న భార‌త‌ లౌకిక వాదంపై తీవ్ర ప్ర‌భావం చూపింద‌న్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం కంటే హిందూ ఛాందసవాదం వల్లే దేశానికి ఎక్కువ ప్రమాదం ఉందని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. దేశంలో 85 శాతం మంది హిందువులు ఉన్నారనీ, ఇంత‌కు ముందు క‌నిపించ‌నంత‌గా ఉన్న‌ హిందూ మెజారిటేరియనిజం ప‌ట్ల త‌న‌కు భీతి క‌లుగుతోంద‌ని చెప్పారు. మ‌రో వైపు ఇస్లామిక్ ఉగ్రవాదం అన్నది ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందని ఆయ‌న అన్నారు. ప్రస్తుతం హిందూ ఛాందసవాదం దేశంలో కొన్ని రాష్ట్రాల‌కి పాకలేద‌ని, అయితే ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇది ఆందోళనకర స్థాయిలో ఉందని రామచంద్రగుహ అన్నారు.

  • Loading...

More Telugu News