: టీ20వరల్డ్ కప్... బంగ్లాపై 55 పరుగుల తేడాతో పాక్ విజ‌యం


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కోల్ కతాలో జ‌రిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ 55 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజా విజయంతో ఆసియా కప్ టీ20 టోర్నీలో బంగ్లాదేశ్ పై పరాజయానికి పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ల‌క్ష్యసాధ‌న‌ దిశ‌లో విఫ‌ల‌మైంది. ఒత్తిడికి గురైన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పాకిస్థాన్ 55 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. పాక్‌ కెప్టెన్‌ అఫ్రిది, పేసర్‌ ఆమిర్‌ కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో విజయం పాక్‌ను వరించింది.

  • Loading...

More Telugu News