: రేపటి నుంచి మాతా వైష్ణోదేవీ ఆలయంలో ఉచిత వైఫై సేవలు


డిజిటల్ ఇండియాలో భాగంగా బీఎస్ఎన్ఎల్ తో కలిసి ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఉచిత వైఫై సేవలకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జమ్మూకాశ్మీర్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మాతా వైష్ణోదేవీ ఆలయంలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆలయానికి బీఎస్ఎన్ ఎల్ ఉచిత వైఫై సేవలను ఢిల్లీ నుంచి టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రేపు ప్రారంభించనున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ, దేశ వ్యాప్తంగా 2,500 ఉచిత వైఫై హాట్ స్పాట్ లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 999 ఉచిత వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైష్ణోదేవి ఆలయం 1000వ స్పాట్ అని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

  • Loading...

More Telugu News