: అసదుద్దీన్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి కోర్టులో ఒక ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. ‘భారత్ మాతా కీ జై’ అనొద్దని ఒవైసీ అన్నారంటూ ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. కాగా, పిటిషనర్ ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ఎంపీ అసదుద్దీన్ పై సెక్షన్ 153 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నేరేడ్ మెట్ పోలీసులను ఆదేశించింది. కాగా, అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ నాలుక తెగ్గోసిన వారికి రూ.21,000 రివార్డు ఇస్తానని మీరట్ కళాశాలకు చెందిన ఒక విద్యార్థి ప్రకటించిన విషయం తెలిసిందే. 'ఒవైసీకి ఈ దేశంపై ప్రేమ లేకపోతే ఇక్కడెందుకు ఉండటం, వేరే చోటుకు వెళ్లిపోవచ్చుగా?' అంటూ బీజేపీ నేత ఆర్కే సింగ్ మండిపడిన విషయం తెలిసిందే.