: మంత్రులు నన్ను తిడుతుంటే స్పీకర్ కు వినసొంపుగా ఉంది: వైఎస్ జగన్
మంత్రులు తనను తిడుతుంటే స్పీకర్ కు అది వినసొంపుగా ఉందని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 'బీద అరుపులు' అన్న వ్యాఖ్యను తప్పుబడుతున్నారని, ఆ మాట వాడుకలో ఉన్నదేనని అన్నారు. స్పీకర్ తనకు మైకు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన విమర్శల వర్షం కురిపించారు. రాచరిక వ్యవస్థలో ఉన్నామని చంద్రబాబు అనుకుంటున్నారని, అయితే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలని అన్నారు. తమ పార్టీకి, టీడీపీకి మధ్య ఉన్న ఓట్ల తేడా 1.8 శాతం మాత్రమేనని జగన్ గుర్తుచేశారు.