: ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం అసెంబ్లీకి లేదు: రోజా తరపు న్యాయవాది
ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం ఏపీ అసెంబ్లీకి లేదని ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు. 340(2) సెక్షన్ కింద ఇది చెల్లదని అన్నారు. 340(1) ప్రకారం సస్పెండ్ చేసే సభ్యుడి లేదా సభ్యురాలి పేరును, మోషన్ లో సూచించాలని, కానీ, అందులో రోజా పేరు మెన్షన్ చేయలేదని అన్నారు. రూల్ 55 ప్రకారం సస్పెన్షన్ మోషన్ ను స్పీకర్ స్క్రూటినీ చేయాలని, కానీ, ఆవిధంగా జరగలేదని, రోజా సస్పెన్షన్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అన్నారు. సభ్యుల హక్కులకు భంగం కలిగినప్పుడు, విచారించే అధికారం కోర్టుకు ఉంటుందన్నారు. రోజాకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడంలోనూ, కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులోని రాజారాం పాల్ పై విధించిన ఏడాది సస్పెన్షన్ ను రీకాల్ చేసిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు రోజా తరపు న్యాయవాది చెప్పారు.