: రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగలేదు... విభజన హామీలు నెరవేర్చాలి!: సీఎం చంద్రబాబు


రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన హామీలను అమలు చేయాలంటూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. మొత్తం 18 అంశాలతో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన బిల్లులోని హామీలన్నీ నెరవేర్చాలని, కేంద్రం విభజన హామీలను త్వరగా అమలు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని విభజన చట్టంలో ఉందని అన్నారు. పొరుగు రాష్ట్రాలకు మెట్రో నగరాలున్నాయని, ఏపీకి మాత్రం మెట్రో నగరం లేదని, రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించాలని, స్థానికత అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని చంద్రబాబు కోరారు.

  • Loading...

More Telugu News