: వాస్తవాలు చెప్పమనడం మూర్ఖత్వమెలా అవుతుంది?: జ్యోతుల నెహ్రూ


వాస్తవాలు చెప్పాలని కోరితే మూర్ఖత్వం ఎలా అవుతుంది? అని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలిసిన వారికి లేదా తెలియని వారికి చెప్పొచ్చు కానీ, మూర్ఖులకు చెప్పలేమంటూ కూన రవి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను స్పీకర్ ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీనికి రవి ప్రతిస్పందిస్తూ, ప్రతిపక్ష నాయకులను మూర్ఖులని తాను అనలేదని.. దొంగలెవరంటే వైఎస్సార్సీపీ సభ్యులు భుజాలు తడుముకుంటున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News