: కళాశాల హాస్టల్ లో మెడికో ఆత్మహత్య


వైద్య విద్య పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న సౌమ్య అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లాలోని నంగునూరు లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో చదువుతున్న సౌమ్య నిన్న రాత్రి ఈ దారుణానికి పాల్పడింది. ఆమె స్వస్థలం ఖమ్మం జిల్లాలోని మన్రీలియం గూడెం. గత నెల 27న నల్గొండ జిల్లాకు చెందిన పవన్ కుమార్ రెడ్డితో ఆమెకు వివాహమైంది. నిన్న సౌమ్యను ఆమె భర్త కాలేజీ హాస్టల్ లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నిన్న రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న కరీంనగర్ రూరల్ సీఐ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, సౌమ్య భర్త పవన్ కుమార్ రెడ్డి కూడా వైద్యుడేనని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News