: త్వరలో 102 సేవలు, పేదల కోసం ఉచిత మార్చురీ వాహనాలు: టీ మంత్రి లక్ష్మారెడ్డి


తెలంగాణలో నూతన 108 అంబులెన్స్ సర్వీసులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాహనాలకు తోడుగా కొత్తగా 145 వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటిలో 30 వాహనాల్లో అడ్వాన్స్ డ్ లైఫ్ సపోర్ట్ వెహికల్స్, బేసిక్ లైఫ్ సపోర్ట్ వెహికల్స్ 115 ఉన్నాయన్నారు. త్వరలోనే మాతా శిశు సంరక్షణకు 102 సేవలు, పేదల కోసం ఉచిత మార్చురీ వాహనాలను ప్రారంభిస్తామని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందన్నారు.అందుకే ఈ బడ్జెట్ లో వైద్య ఆరోగ్య రంగానికి రూ.6 వేల కోట్లు కేటాయించినట్లు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News