: పెషావర్ లో బస్సులో బాంబు పేలుడు... 11 మంది మృతి


పాకిస్థాన్ లోని పెషావర్ లో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుని వెళుతున్న బస్సులో బాంబు పేల్చారు. ఈ ఘటనలో సుమారు 11 మంది వరకు మృతి చెందారు. 30 మంది గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పట్టణంలో రద్దీగా ఉండే సరద్ ప్రాంతంలోని మసీదు రోడ్డులో బస్సు ఆగిన సమయంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. గాయపడిన వారిని లేడీ రీడింగ్ హాస్పిటల్ కు చికిత్స కోసం తరలించారు. కొంత మందిని కంటోన్మెంట్ ఆస్పత్రికి కూడా తరలించారు. పేలుడు ధాటికి బస్సు తునాతునకలవడమే కాకుండా, 30 నుంచి 40 అడుగుల దూరం ఎగిరి పడినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. స్థానిక పోలీసుల కథనం మేరకు.. ఈ బస్సు చార్ సద్దా నుంచి పెషావర్ కు ప్రభుత్వ ఉద్యోగులతో వెళుతోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News