: ముంబై ఎయిర్ పోర్టులో విమానం దిగుతుండగా పేలిపోయిన టైర్... పలువురికి గాయాలు


ముంబై విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండవుతున్న సమయంలో రన్ వేపై దిగిన విమానం టైర్ పేలిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయలు అయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పిపోవడంతో విమానంలో ఉన్న 161 మంది ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ బస్ ఏ320 విమానం మంగళవారం రాత్రి 10 గంటలకు నాగ్ పూర్ నుంచి ముంబై చేరుకుంది. విమానాశ్రయంలో రన్ వేపై దిగిన వెంటనే టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ సమయంలో చోటు చేసుకున్న కుదుపులకు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News