: జైల్లో ఉండాల్సిన వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టారు...'సీవీసీ' చౌదరిపై సుప్రీంకోర్టులో రాంజెఠ్మలానీ వాదన


చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి విషయంలో ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రాంజెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీవీసీగా చౌదరి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సత్వరమే విచారణ చేపట్టాలని ఆయన సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. జైల్లో ఉండాల్సిన వ్యక్తిని ఎన్డీయే ప్రభుత్వం సీవీసీగా నియమించిందని రాంజెఠ్మలానీ వ్యాఖ్యానించారు. దీంతో చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని ధర్మాసనం భిన్నంగా స్పందించింది. ‘మీరు ఎక్కువ శాతం జైళ్లలో ఉన్న వారిని బయటకు రప్పించేందుకు వాదిస్తుంటారు. ఇప్పుడు ఓ వ్యక్తిని జైల్లోకి పంపాలని అనుకుంటున్నారా?‘ అని ధర్మాసనం రాంజెఠ్మలానీని ప్రశ్నించింది. దీనికి ఆయన అలా కాదని బదులివ్వడంతో రాంజెఠ్మలానీ పిటిషన్ పై ఈ నెల 29న విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. కామన్ కాజ్ అనే స్వచ్చంద సంస్థ సీవీసీగా కేవీ చౌదరి నియామకాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News