: నేటి నుంచే భాగ్యనగరంలో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన


బుధవారం నుంచి ఐదు రోజుల పాటు భాగ్యనగరం ఐదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు వేదిక కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో ఈ ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్న తొలి ప్రదర్శన కావడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పాల్గొననున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు 29 విభాగాల్లో విమాన, హెలికాప్టర్ల విన్యాసాలు, ప్రదర్శనలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. 25 దేశాల నుంచి మంత్రులు, రాయబారులు, 200 కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రతి రెండేళ్లకోసారి అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News