: ఈక్వెడార్ లో ఘోర విమాన ప్రమాదం.. 22 మంది దుర్మరణం
ఈక్వెడార్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 19 మంది సైనికులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈస్ట్రన్ ప్రావిన్స్ పాస్తజాలోని అమేజాన్ అడవుల్లో విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనను ఆ దేశాధ్యక్షుడు రాఫెల్ కొరియా ధ్రువీకరించారు. ప్రమాదంలో ఒక్కరూ బతికి బయటపడలేదని ఆయన ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విమానంలో 19 మంది సైనికులతోపాటు ఇద్దరు పైలట్లు, ఒక మెకానిక్ ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం తెలిసిన అనంతరం రక్షణ మంత్రి రికార్డో పాటినో, సహాయక సిబ్బందితో కలసి ప్రమాద స్థలికి బయల్దేరి వెళ్లారు.