: 'టీ20' భారత్-పాక్ మ్యాచ్‌కి బిగ్ బీ!
భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా దాయాదుల పోరు ఈ నెల 19న ఈడెన్ గార్డెన్ లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిలవనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు తాను జాతీయగీతం ఆలపించనున్నట్లు అమితాబ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తమ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చొరవతోనే అమితాబ్ మ్యాచ్ కు రావడానికి ఒప్పుకున్నారని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మంగళవారం తెలిపింది. మరోవైపు పాకిస్థాన్ జట్టు తమ జాతీయ గీతాన్ని క్లాసికల్ సింగర్ షఫాకత్ అమనాత్ అలీతో పాడించాలని చూస్తోంది.