: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు
టీ20 వరల్డ్ కప్ లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ లో కివీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నాగపూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆసియాకప్ విజయంతో ఊపు మీదున్న టీమిండియా ఆరంభ మ్యాచ్ ను సొంతం చేసుకునేందుకు తహతహలాడుతోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా భారత్ పై విజయం సాధించాలని చూస్తోంది. కాగా, పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలున్నాయని క్యురేటర్ పేర్కొన్నారు. ఈ పిచ్ స్పిన్నర్లకు అంతగా అనుకూలించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.