: టీ20 వరల్డ్ కప్ లో భారత్ మహిళల జట్టు బోణీ
టీ 20 వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మిథాలీ సేన మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్ పై జరిగిన పోరులో 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్ ను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరింది. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ లక్ష్య ఛేదనలో తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.