: రేపటికి వాయిదాపడ్డ ఏపీ శాసనసభ


ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం కోడెల ప్రసంగించారు. తనపై అవిశ్వాసం పెట్టడం కొంత బాధ కల్గించిందని అన్నారు. అవిశ్వాసం వీగిపోయేలా తనకు మద్దతుగా నిలిచిన సభ్యులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తన జీవితం గురించి, తాను వైద్యుడవటానికి గల కారణాలు, వైద్య వృత్తి జీవితం, రాజకీయాల్లోకి ప్రవేశించడం మొదలైన విషయాలను కోడెల ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు స్పీకర్ కు సంఘీభావం తెలిపారు. అనంతరం సభ రేపటికి వాయిదాపడింది.

  • Loading...

More Telugu News