: జగన్ పై మండిపడ్డ నారా లోకేశ్
ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. న్యాయవ్యవస్థ, మీడియా, స్పీకర్ పై జగన్ కు గౌరవం లేదని; టీడీపీ ప్రభుత్వంపై ఆయనకు విశ్వాసం లేదని లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై ప్రజలకు విశ్వాసం పోయిందని, ఆ విషయాన్ని ఆయన గ్రహించాలని లోకేశ్ అన్నారు.